నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తా..
28 Feb, 2022 17:10 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌గా తనను నియమించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.