అభివృద్ధి పనులకు ఎంపీ విజయసాయిరెడ్డి శంకుస్థాపన
16 Jan, 2020 11:29 IST
నెల్లూరు: ముత్తుకూరు మండలంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటిస్తున్నారు. తాళ్లపూడిలో విజయసాయిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.