ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి
13 Dec, 2021 18:08 IST
న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి సోమవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో పార్లమెంట్‌లోని ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కడపలో ఏర్పాటు చేస్తున్న వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆమెతో చర్చించారు.