కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు.
కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం భేటీ అయ్యారు. మంత్రితో పాటు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్ లా వర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ పనులు వేగవంతం చేయాలని అడిగామన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందని.. ఏపీలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరామని తెలిపారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.