ఎలాంటి సహకారం కావాలన్నా..ఎప్పుడూ సిద్ధమే
8 Mar, 2021 13:07 IST
విశాఖ:ఎలాంటి సహకారం కావాలన్నా.. అన్ని విధాల మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం విశాఖలో జరిగిన కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కులాల విషయంలో తమకు పెద్ద పట్టింపు ఉండదన్నారు. ఎవరైనా ఒకటే దృష్టితో చూస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలుపు తథ్యమన్నారు. కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.