నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు బాబూ
30 Aug, 2019 11:36 IST
అమరావతి: గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రిక్షాలు తొక్కాలని, హమాలీ పని చేయాలని నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు అని హెచ్చరించారు. ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారని, గుండె రాయి చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్పందించారు.