స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
విజయనగరం: ఈ నెలలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకాలు అర్హులకు అందాయన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి అన్ని స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురువేయాలని సూచించారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొద్దెట్టి మాధవి, విజయనగరం శాసనసభ్యులు పాల్గొన్నారు.