విశాఖ వీధుల్లో మార్మోగుతున్న `విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు`
విశాఖ: విశాఖ నగర వీధులు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదం మార్మోగుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన విజయసాయిరెడ్డి పాదయాత్రకు విశాఖ వీధుల్లో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విజయసాయిరెడ్డి వెంట అడుగులు వేస్తున్నారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అప్పలరాజు, ఎంపీలు సుభాష్‌చంద్రబోస్, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మోహన్, కన్వీనర్ కేకే రాజు, కుంబా రవిబాబు, విజయప్రసాద్, పంచకర్ల రమేష్, పసుపులేటి బాలరాజు, పార్టీ శ్రేణులు, విశాఖ నగర వాసులు, స్టీల్‌ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు.