ఫైబర్ నెట్ స్కామ్ లో జైలుకు వెళ్లక తప్పదు పప్పూ
విశాఖ: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ స్కామ్‌లో నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. రూ. 321 కోట్ల ఫైబర్ నెట్ స్కామ్ లో జైలుకు వెళ్లక తప్పదు పప్పూ! అక్కడ మూడుపూట్లా పప్పు భోజనం ఏర్పాటు చేసుకో. వేమూరి హరికృష్ణ చౌదరి అన్నీ కక్కుతాడు. ఇంటింటికి టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులివ్వమని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పందికొక్కుల్లా తినేశారు కదరా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
వ్యక్తిత్వ నిర్మాణంలో లోపాలు తీవ్ర ఆత్మన్యూనతా భావానికి దారితీస్తాయి. దొరకాల్సిన గౌరవం దక్కడం లేదని, తిరస్కృతులుగా మారామనే ఆందోళన వీరిని సమాజంపై అకారణ ద్వేషం కనబర్చేలా చేస్తుంది, చంద్రం, పప్పు, కుల మీడియాది ఇదే పరిస్థితి. దురుసుతనం, అనాగరిక ధోరణి దీని లక్షణాలు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
పప్పేష్! నీ పాదయాత్ర కోసం ఈ డాన్స్ షూటింగులు ఏంటి? తెలుగు డ్రామాల పార్టీ కామెడీ షో 'పులిని చూసి నక్క వాతలు' పెట్టుకోవడమే! దద్దమ్మను సిఎం చేయండని దేబిరించడానికా? పార్టీ నీది కాదు. ఏం చేస్తావో చెప్పువు. పాటల షూటింగులు, ‘సినిమా’ ప్రమోషన్లకే కోట్లు తగలేసేటట్టున్నావు బొకేష్! అంటూ విజయసాయిరెడ్డి ఇవాళ ఉదయం చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.