ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగాం సురేష్ డిమాండు చేశారు. న్యూఢిల్లీలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గని భరత్‌తో కలిసి నందిగాం సురేష్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాను అటకెక్కించింది చంద్రబాబేనని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నోటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి అర్ధరాత్రి అమరావతికి పారిపోయారని ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద దిగజారి పోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని కాకుండా చంద్రబాబు, ఆయన కొడుకు అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాను నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా అన్నది ఎప్పటికైనా ఇచ్చి తీరాల్సిందే. కేంద్రం మాటిచ్చింది కాబట్టి..ఆ మాటకు విలువ ఉండాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండు చేశారు.