పవన్‌ కళ్యాణ్‌ది సైకోయిజం..శాడిజం

10 Jul, 2023 14:50 IST

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ది సైకోయిజం..శాడిజమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నందిగం సురేష్‌ విమర్శించారు. పవన్‌ వీధి కుక్కలా తయారయ్యాడని మండిపడ్డారు. పవన్‌ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పవన్‌ అనే వ్యక్తి రాష్ట్రానికి పట్టిన శని, ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. ప్రజలు రెండు చోట్ల ఓడించినా పవన్‌కు బుద్ధి రాలేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ ఆఫీస్‌ బాయ్‌లా పని చేస్తున్నారని పేర్కొన్నారు. బిస్కెట్ల కోసం పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.