సీఎం వైయస్ జగన్ సంక్షేమ రథసారధిగా గుర్తింపు
15 Apr, 2023 12:35 IST
తాడేపల్లి: జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ రథ సారధిగా గుర్తింపు పొందారని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. సంక్షేమంతో అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతోందన్నారు. వైయస్ జగన్ పాలనతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇది జగనన్నపై ఉన్న నమ్మకం..ఇదొక చరిత్ర అన్నారు. ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వైయస్‌ఆర్‌సీపీ చేస్తుందని చెప్పారు. గ్రోత్ రేట్‌లో దేశంలోనే ఏపీ ముందుస్థానంలో ఉందన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు.
రాష్ట్రంలో ఒక మెగా పీపుల్స్ సర్వే జరుగుతోంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గాడి తప్పిన పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నూతన పరిపాలన విధానానికి తెర లేపారు. అర్హతే ప్రమాణికంగా ప్రతి పేదకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో, కులమతాలకు అతీతంగా, అర్హతే ప్రమాణికంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కాబట్టే ఇవాళ వైయస్ జగన్‌కు ఒక సంక్షేమ రథసారధిగా గుర్తింపు లభించింది. కుటుంబ తలసరి ఆదాయం, జీడీపీ గడిచిన నాలుగేళ్లలో ఏ విధంగా పెరిగిందో గణంకాలతో పాటు చెప్పాం. ఆధారాలతో సహా ఈ అంశాలను చెప్పాం. ప్రజల తీర్పును కోరాలనే ఉద్దేశంతో మెగా పీపుల్స్ సర్వే పేరుతో వెళ్లినప్పుడు జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగనన్న అంటున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతూ అడుగులు వేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. కులం, మతం, ప్రాంతాన్ని చూడకుండా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా, వెల్‌నెస్ సెంటర్ల ద్వారా కొత్త పరిపాలన వ్యవస్థకు వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలను గతంలో అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయి. ఇందుకు పూర్తి భిన్నంగా వైయస్ జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు రాజకీయంగా ఈ వర్గాలకు గౌరవాన్ని, గుర్తింపు ఇచ్చారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ ప్రతి సైనికుడు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. జగనన్న సీఎం అయ్యాక మీ ఇంటికి ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అందాయని ప్రశ్నిస్తున్నారు. మా సైనికులు ఐదు రకాలుగా అడిగిన ప్రశ్నలకు జనం నుంచి అవును అని సమాధానం చెబుతున్నారు. సీఎం వైయస్ జగన్‌ను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సంక్షేమం రూపంలో ప్రజలకు ఇస్తే ఆరు రూపాయలు మధ్య వర్తులకు , దళారులకు వెళ్లేది. నిజమైన లబ్ధిదారుడికి కేవలం రూ.4 మాత్రమే అందేది. ఇవాళ లబ్ధిదారుడికి రూ.10 వేలు గ్రీన్ చానల్ ద్వారా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఒక్క పైసా కూడా తేడా లేకుండా రూ.10 వేలకు రూ.10 వేలు లబ్ధిదారుడికి అందుతున్నాయి. వాలంటీర్లు ప్రతి ఒకటో తేదీనే తెల్లవారకముందే పింఛన్లు అందిస్తున్నారు. నిండు మనసుతో వైయస్ జగన్‌ను ఆశీర్వదిస్తున్నారని ఎంపీ మోపిదేవి తెలిపారు. వైయస్ జగన్ పాలనలో అమలవుతున్న పథకాలు భవిష్యత్‌లో కూడా కొనసాగాలని ముక్తకంఠంతో కోరుతున్నారని పీపుల్స్ సర్వే వివరాలను మోపిదేవి వెంకటరమణ వివరించారు,