అమరావతి పేరుతో మోసం చేసిన చంద్రబాబు

3 Feb, 2020 17:26 IST

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరువూరును తొలుత రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు..ఆ తరువాత అమరావతిలో భూములు కొనుగోలు చేసి అక్కడికి మార్చారు. రాజధాని ప్రాంతంలో టీడీపీకి చెందిన వ్యక్తులు 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. 700 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. రాజధాని భూముల అక్రమాలపై ఏపీలో విచారణ జరుగుతుందని లోక్‌సభలో చెప్పారు.