సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

10 Mar, 2020 12:23 IST

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.