శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ..!

22 Nov, 2023 20:09 IST

విశాఖపట్నం:శిఖండి రాజకీయాలు మానండి చంద్రబాబూ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూచించారు.  బుధ‌వారం విశాఖ‌లో వరుదు కళ్యాణి మీడియాతో ఏం మాట్లాడారంటే: 

– ఈ రాష్ట్రానికి జగన్‌గారే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిసి పనికి మాలిన వాళ్లు జగనన్న ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారు. 
– ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌ గారు. మీకు దమ్ముంటే ఆయనపై మాట్లాడండి. 
– రాజకీయ పోరాటం చేస్తున్నది జగన్‌ గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై పోరాటం చేయండి. 
– మీకు నిజంగా దమ్ముంటే మీ భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా.. ఆమెతో మాట్లాడించండి. 
– లేదంటే బ్రాహ్మణి గారితో మాట్లాడించండి. మేం ఏం సమాధానం చెప్తామో చూడండి. 
– భారతమ్మ గారి కాలిగోటితో కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. 
– ఆకాశం లాంటి భారతమ్మపై బురద జల్లాలంటే అగ్నికి ఆçహుతి కావడం ఖాయం. 
– ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే దింపిన నాటి నుంచి చంద్రబాబుకు ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అలవాటు. 
– ఒక శిఖండిలా వెనకుండి ఆడవాళ్లను అడ్డుపెట్టి చంద్రబాబు బాణాలు వేస్తూ ఉంటాడు. 
– దానిలో భువనేశ్వరి, బ్రాహ్మణి, పురందేశ్వరి లాంటి వాళ్లను వాడుకుంటున్నారు. 

దమ్ముంటే చంద్రబాబు బొమ్మ పెట్టుకుని రండి:
– జగన్‌గారు సాక్షి పత్రిక, ఛానల్‌ తనది కాదు అనలేదు. వాటిని స్థాపించిందే జగన్‌గారు. 
– నాణేనికి రెండో వైపు చూపించడానికే ఆయన వీటిని పెట్టారు. 
– దమ్ముగా  వైయ‌స్ఆర్‌ బొమ్మ పెట్టుకుని వాటిని నడుపుతున్నారు. 
– ప్రస్తుతం సాక్షి పత్రికను జగన్‌ గారు నడపడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత తన భార్యకు ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. 
– ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మాత్రం ముసుగేసుకుని బాబుకు అనుకూలంగా నడుపుతున్నారు. 
– మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఫొటో పెట్టుకుని నడపండి. 
– అది మానేసి న్యూట్రల్‌ మీడియా అంటూ బిల్డప్పులెందుకు..? 
– చంద్రబాబు స్కాంల గురించి, దోపిడీ గురించి ఆ మీడియా ఏనాడన్నా రాసిందా? 
– పచ్చ మీడియాతో తనకు సంబంధం లేదు అని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎవరైనా చెప్పగలరా? 
– ముసుగు తొలగించండి.. నిజాయితీగా యుద్ధం చేయండి. 
– ఇలాంటి శిఖండి రాజకీయాలు మానండి. 

ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో కత్తి అందించింది భువనేశ్వరే:
– ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు భారతమ్మపై చేయడం సమంజసం కాదు. 
– చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే ఆ వెన్నుపోటుకు కత్తి అందించింది భువనేశ్వరి. 
– ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాంలో భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చలేదా? 
– హెరిటేజ్‌ అధినేతగా భువనేశ్వరిగారే కదా ఉన్నది.. ఆమె కోసమే ఆ స్కాం చేశారా? 
– ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నా మేం ఏనాడూ దిగజారి మాట్లాడలేదు.