మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
విశాఖ: మహిళల పాలిట చంద్రబాబు రాక్షసుడని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఈయన అధికారంలోకి వస్తే పది లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తారట. మరి, 2014–19 మీ పాలనలో వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసినది మర్చిపోయారా? అని నిలదీశారు. బుధవారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఏమన్నారంటే..
*మహిళా ద్రోహి, మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు:*
– ఉత్తరాంధ్రలో చంద్రబాబు మహిళా సదస్సులంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
– ఆయన మహిళల కోసం ఏదో చేశారట..మహిళా పక్షపాతి అని చెప్పుకొచ్చాడు.
– అతని మాటలు విని మహిళలు నవ్వుకుంటున్నారు. ఇంతటి పచ్చి అబద్ధాలు కూడా చెప్తారా అని నవ్వుకుంటున్నారు.
– ఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి, మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు.
– కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు.
– ఈయన అధికారంలోకి వస్తే పది లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తారట.
– మరి, 2014–19 మీ పాలనలో వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసినది మర్చిపోయారా?
– దీని వల్ల ఏ, బీ గ్రేడ్‌లలో ఉన్న డ్వాక్రా సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి.
– డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను మోసం చేసి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా వారిని అప్పుల పాలు చేసింది మీరు కాదా?
– మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా?
– రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా?
– దీనివల్ల, డ్వాక్రా మహిళలు రూ.3వేల కోట్ల అపరాధ వడ్డీ బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చింది చంద్రబాబే.
– ఆడ బిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తానన్న మీరు ఒక్కరికైనా ఇచ్చారా?
– గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబే.
– ఇన్ని మోసాలు చేసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు?
– మా జగనన్న ఇచ్చినట్లు 44 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి పథకం మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు?
– 80 లక్షల మంది డ్వాక్రా మహిళకు అసరా ఇచ్చి ఆదుకున్న మనసున్న నాయకుడు జగనన్న.
– ఆనాడు మీరు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎగ్గొడితే, జగనన్న రూ.25,500 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలను ఆసరా ద్వారా నాలుగు విడతలుగా ఇచ్చారు.
– చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు రూ.19వేల కోట్లు మహిళల అకౌంట్లలో వేసి వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు.
– మహిళలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మీరెందుకు చేయలేకపోయారు?
– 22 లక్షల ఇళ్లు మహిళల పేరున కట్టిస్తున్నారు. మీరెందుకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మహిళల పేరుతో ఇళ్లు కట్టలేదు?
– అన్ని జగనన్న చేస్తే ఇప్పుడు మీరొచ్చి ఏదో చేస్తానంటూ మభ్యపెడుతున్నారు.
*మీది మేనిఫెస్టో కాదు..‘మాయా’ఫెస్టో..!:*
– మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లోంచే తీసేసిన మీరు ఇప్పుడు మినీ మేనిఫెస్టో అంటూ ప్రజల ముందుకు వచ్చారు.
– ఆ మినీ మేనిఫెస్టోలో అన్నీ కాపీ పేస్ట్ పథకాలే. అది మేనిఫెస్టో కాదు..‘మాయా’ఫెస్టో.
– అబద్దానికి ఫ్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.
– మేనిఫెస్టోను జగనన్న బైబిల్,ఖురాన్, భగవద్గీతగా భావించి ఇచ్చిన హామీల్లో మేజర్ లబ్ధిదారులు మహిళలే.
– మీ మేనిఫెస్టోలో సొంతగా ఒక్క పథకం కూడా పెట్టుకోలేని దుస్థితి మీది.
– మీరిచ్చిన సూపర్ సిక్స్‌లో మూడు మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే.
– మిగిలిన మూడింటిలో రెండు కర్నాటక కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టాడు.
– మరొకటి కర్నాటకలో బీజేపీ ఇచ్చిన హామీల్లోంచి ఒక పథకం తీసుకుని కాపీ కొట్టారు.
– మీరు కాపీ క్యాట్‌లా ప్రవర్తిస్తున్నారు తప్ప మహిళల కోసం సొంతగా ఒక పథకం కూడా ఆలోచన చేయలేకపోతున్నారు.
– ఇలాంటి మీరు మహిళలకు ఏదో చేస్తారంటే మిమ్మల్ని ఎలా నమ్ముతారు?
– ఐదేళ్లలో ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తాడట.
– 2014–19 మధ్య ఇదే కూటమి పరిపాలన చేసింది. అప్పుడు చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో గుర్తుందా?
– కేవలం 34వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు. అలాంటిది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట.
– డిఎస్సీ కాదు కదా..ఏ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదన్న విషయం ఆంధ్ర రాష్ట్ర యువత మర్చిపోలేదు.
– ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2వేల నిరుద్యోగ భృతి అని చెప్పి యువతను మోసం చేశారు.
– ఈ ఐదేళ్లలో జగనన్న 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో కలిపితే 6.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
– రాష్ట్రంలో ఒక ఉద్యోగ విప్లవాన్నే జగనన్న కల్పించారు.
– వైద్య ఆరోగ్య రంగంలో ఖాళీ అనేది ఉండకూడదని పూర్తి స్థాయిలో 54 వేల నియామకాలు చేపట్టారు.
– పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,511 ఉద్యోగాలు ఇచ్చారు.
– ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల 52 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులయ్యారు.
– మీరా ఉద్యోగాల గురించి మాట్లాడేది?
– మీరు 2018లో ఎన్నికల స్టంట్‌గా ప్రకటించిన డిఎస్సీ ఉద్యోగాలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారు.
*వీధికో బెల్ట్ షాపుతో మద్యం ఏరులై పారింది మర్చిపోయారా బాబూ..?:*
– మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వీధికో బెల్ట్ షాపుల రూపంలో మద్యం ఏరులై పారింది.
– జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 4,500 మద్యం షాపులను 3వేలకు తగ్గించారు.
– పర్మిట్ రూమ్స్‌ను కూడా పూర్తిగా తొలగించారు. 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా క్లోజ్ చేశారు.
– మీ హయాంతో పోలిస్తే 40 శాతం మద్యం అమ్మకాలను మా ప్రభుత్వం తగ్గించింది.
– మీ హయాంలో రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చారు. మీ హయాంలో కేబినెట్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావే ఆనాడు ఈ విషయాన్ని చెప్పారు.
– స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి గంజాయిని ఉక్కు పాదంతో అణచివేసిన పరిస్థితి మీకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు.
*రాజ్యాంగం కల్పించిన అవకాశాలకు మిన్నగా జగనన్న ఇచ్చారు:*
– చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ లేక ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారు.
– వైఎస్‌జగన్ గారు సీఎం అయిన తర్వాత దిశ యాప్,ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి ఆడపిల్లకు రక్షణగా ఉన్నారు.
– దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా, దాని ప్రకారం మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మాది.
– మహిళలు ముఖ్యమంత్రులుగా చేసిన రాష్ట్రాల్లో కంటే మిన్నగా జగనన్న ఇక్కడ చేశారు.
– రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
– జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో మహిళల్ని కూర్చోబెట్టారు.
– మహిళలకు నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఇవ్వాలని ఏకంగా చట్టమే చేశారు.
– ఆడబిడ్డకు కన్నవారు ఇవ్వని ఆస్తి 31 లక్షల ఇళ్ల పట్టాల ద్వారా జగనన్న ఇచ్చారని ప్రతి మహిళ అనుకుంటోంది.
– ప్రతి మహిళ గర్వంగా చెప్పుకునేలా మహిళా పక్షపాత ప్రభుత్వం అందించింది జగన్ గారే.
*టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు- ఇదే చివరి మేనిఫెస్టో*
– తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు..ఇదే చివరి మేనిఫెస్టో..ఇవే చివరి అబద్ధాలు కూడా.
– చంద్రబాబు ఎంత మభ్యపెట్టాలని చూసిన ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలంతా జగనన్నకు జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
– ప్రతి మహిళా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని జగనన్న కల్పించారు.
– రాజకీయంగా కూడా జనరల్ కేటగిరీ స్థానాల్లో సైతం మహిళలను కూర్చోబెట్టి వారిని ఉన్నతంగా నిలిపారు.
– తన అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత రక్షణగా ఉంటారో, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవుతారో జగనన్న పాలనలో మహిళలు అలా ఉన్నారు.
– అందుకే మహిళలంతా మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
– దానికి నిదర్శనంగానే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మహిళలు జగనన్నను పెద్ద ఎత్తున ఆశీర్వదించారు.