ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన
11 Feb, 2026 12:51 IST
అమరావతి: రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొనసాగుతోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందడం లేదని, కూటమి నేతలు మహిళలను వంచడం, రైతులను, విద్యార్ధులను మోసం చేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ పరిస్థితులను పట్టించుకోకపోవడం ప్రజా హక్కులను కాలరాయడమే అన్నారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని విమర్శించారు. రెండేళ్లలోపే ఈ ప్రభుత్వం రూ. 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఈ పరిస్థితులపై అసెంబ్లీలో మాట్లాడాలంటే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు.