చంద్రబాబుకు దేనిపైనా ఒక స్టాండ్ లేదు
16 Jan, 2020 12:19 IST
తూర్పుగోదావరి: చంద్రబాబాబుకు దేనిపైన ఒక స్టాండ్ లేదని శాసన మండలి ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. మూడు రాజధానులను అందరూ స్వాగతించాలన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై అవగాహన లేక విమర్శిస్తున్నారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చూడకుండా పక్కన పడేశారన్నారు. అమరావతి భూములు కట్టడాలకు పనికి రావు అన్నారు.అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొన్నారు.