సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం
21 Dec, 2019 15:19 IST
తాడేపల్లి: చట్టాలను అమలు చేయడంలో సీఎం వైయస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండాలన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఏ పార్టీ నాయకుడు చేయని పాదయాత్ర వైయస్ జగన్ చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఉద్దేశమని చెప్పారు.