చంద్రబాబు ఏడాది పాలన మోసం.. దగా
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు పరిస్థితి ఉందని.. రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదని వైయస్ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం జమ్మలమడుగు నియోజకవర్గం పెద్ద ముడియం మండలంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే నవరత్నాలు అమలు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే నాటికి 7 వేల కోట్ల రూపాయలు ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు’’ అంటూ రామసుబ్బారెడ్డి నిలదీశారు.