జ‌గ‌న‌న్న‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం

29 Dec, 2025 12:58 IST

నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కష్టపడి పని చేయాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి  పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో విద్యార్థి విభాగం నేత చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కోలాహలం నెలకొంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో హాజరై పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేత చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి పైగా కార్యకర్తలు పాల్గొని, నెల్లూరు సిటీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సత్క‌రించారు.  వైయస్ జగన్ గారి ఆదేశాలతో, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనలతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తామని  విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా గజమాలతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని, పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చంద్రారెడ్డి కి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలతో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే చంద్రారెడ్డిని నెల్లూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమించామని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడు చంద్రారెడ్డి అని కొనియాడారు. విద్యార్థుల కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొని విజయవంతం చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో చంద్రారెడ్డి  మరింత ఉన్నత నాయకత్వాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తామని తెలిపారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో కార్యకర్తల ఉత్సాహంతో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. 
భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పనిచేసి వైయస్ జగన్‌ గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కష్టపడి పని చేయాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 9వ డివిజన్ ఇంచార్జ్ ధనుజా రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.