12న వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీని విజ‌య‌వంతం చేయాలి

10 Nov, 2025 12:55 IST

బద్వేలు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరగనున్న భారీ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం పోరుమామిళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  నాయకులతో కలిసి ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వమే చూసుకోవాలని, వాటిని ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మెరుగైన వైద్యం దూరమవుతుందన్నారు.గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా తమ మద్దతు తెలిపినట్లు తెలిపారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని, అందులో ఐదు కాలేజీలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,ప్రభుత్వ మాజీ సలహాదారులు నాగార్జున్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురు మోహన్, నియోజకవర్గ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్, సీఎం భాష, హనుమంతు రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, సుందర్ రామిరెడ్డి, పోరుమామిళ్ల జజెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మాజీ ఆప్కాస్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రంగసముద్రం, టేకురుపేట సర్పంచులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, కల్లూరు రమణారెడ్డి,జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రామ సుబ్బారెడ్డి, జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ బాష, జిల్లా మేధావుల విభాగాల ఎడ్యుకేట్ మెంబర్ గాజులపల్లె రవిచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు