మీరిచ్చిన మాటేంటి... చేస్తున్నదేంటి ?
4 Mar, 2025 11:10 IST
అమరావతి: విద్యుత్ చార్జీలపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటేంటి...ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం శాసన మండలిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఓట్ల కోసం విద్యుత్ చార్జీలు పెంచమని టిడిపి రకరకాలుగా ప్రచారాలు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ తో పాటు సర్దుబాటు ఛార్జీలు ..టైమ్ ఆఫ్ ది డే ఛార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారా...ఇది మాటతప్పడం కాదా అని అరుణ్‌కుమార్ కూటమి సర్కార్‌ను నిలదీశారు.