టీడీపీ ఆఫీస్ క్షుద్రశక్తులకు నిలయం
21 Oct, 2021 13:16 IST
చిత్తూరు: తెలుగు దేశం పార్టీ కార్యాలయం క్షుద్రశక్తులకు నిలయమని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజామాట్లాడుతూ..ప్రియతమ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు చంద్రబాబు దిగారని, ఇది ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతల అప్రజాస్వామిక నిర్ణయాన్ని ఎండగడుదామని ఆమె పిలుపునిచ్చారు.