పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా పనిచేస్తా

10 Feb, 2020 13:37 IST

ఏలూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కోఠారి అబ్బయ్య చౌదరి,   వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు హాజరయ్యారు. తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం వైయస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.