సీఎం వైయస్ జగన్ చేసే మేలు ఓర్వలేకే టీడీపీ సభ్యుల ఆందోళన
23 Jul, 2019 11:58 IST
అమరావతి: మహిళలకు, పేదలకు సీఎం వైయస్ జగన్ చేసే మేలు ఓర్వలేకే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ విమర్శించారు. మంగళవారం మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పెట్టిన బిల్లు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు.