ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన
4 Jan, 2022 16:27 IST
అనంతపురం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన పింఛన్ సొమ్మును, కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోంది. మంగళవారం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గం మండల పరిషత్ రెండో ఉపాధ్యక్షుల ఎన్నికలో పాల్గొని బ్రహ్మసముద్రం మండల రెండో ఎంపీపీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బోయ సునందమ్మను అభినందించారు.