చంద్రబాబు నివాసం వరండాలోకి నీళ్లు
16 Aug, 2019 14:10 IST
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వరండాలోకి నీళ్లు వచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. మీడియా దృశ్యాల్లో చంద్రబాబు ఇంట్లో నీళ్లు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బాబు నివాసం నీటిలో ముగడంతో టీడీపీ డ్రామాలాడుతుందన్నారు. ముంపునకు గురయ్యే వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు డ్రోన్లతో విజువల్స్‌ను చిత్రీకరిస్తున్నామన్నారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారని, ఇంటి చుట్టూ వరద వస్తోందని మేం చెబుతుంతే టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నివాసంలోకి వరద వస్తోందని చంద్రబాబే వెళ్లిపోయారన్నారు. ఇక టీడీపీ కార్యకర్తల గొడవేంటని ఆమె ప్రశ్నించారు.