పవన్ వ్యాఖ్యలు అర్థరహితం
తాడేపల్లి: వైయస్ఆర్సీపీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తప్పుపట్టారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు సుధాకర్‌బాబు సవాలు విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతలు లేరా అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నను ఎందుకు మాచర్ల పంపించారని ప్రశ్నించారు. కులాల పేరుతో చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర అన్నారు. చంద్రబాబు చెప్పేదే పవన్ చేస్తున్నారని విమర్శించారు. పిన్నెళ్లిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. టీడీపీ నేత బోండా ఉమ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం చేసిన చరిత్ర బోండా ఉమది అని గుర్తు చేశారు. బోండా ఉమా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో మాతో వస్తే చూపిస్తామన్నారు.