సీఎం వైయ‌స్ జగన్‌ పేదవారికి అండగా నిలుస్తున్నారు 

25 Sep, 2023 14:15 IST

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద‌వారికి అండ‌గా నిలుస్తున్నార‌ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను సీఎం వైయ‌స్ జగన్‌ పరిష్కరించారు. హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌దే అని కొనియాడారు. అందదికీ సమానమైన స్థాయి, న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం వైయ‌స్ జగనే అన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ కార్మికులు, కర్షకులను ప్రేమిస్తారని చెప్పారు. భూమాతను కొందరికే సొంతం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సుధాక‌ర్‌బాబు విమ‌ర్శించారు.