సీఎం వైయస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
కర్నూలు: కరోనా కష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైయస్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ‘వైయస్సార్ ఆసరా’ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు నగదును జమచేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మహానంది మండలంలో శనివారం ‘వైయస్సార్ ఆసరా’ వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని,పొదుపు సంఘాలకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎవరైనా రూ.100 లంచం అడిగినా నా సెల్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ నంబర్ 9666002121 కాల్ చేసి వివరాలు అందిస్తే అవినీతి అంతు చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పొదుపు మహిళలతో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.