ప్రజల చెంతకే వైద్యం
అనంతపురం: వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్దకే వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారని ఎమ్మెల్యే శంకర్ నారాయణ తెలిపారు. ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల పరీక్షలు అందించే వైద్య సదుపాయాలతో పాటు సలహాలు సూచనలు కూడా జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. శుక్రవారం రొద్దం మండలం, తురకలపట్నం సచివాలయం నందు "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ పాల్గొన్నారు. "జగనన్న ఆరోగ్య సురక్ష" లో అందించే వైద్య సదుపాయాలను, అక్కడ ఉన్న మెడికల్ క్యాంపును సందర్శించి మందులను, పరికరాల వివరాలను తెలుసుకొని, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.