సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు  

23 Jul, 2019 17:08 IST

అమరావతి: మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలకు చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించడం, తనకు మొట్ట మొదట ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.  గత ప్రభుత్వం ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వాడుకుందని విమర్శించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ‘ఆకాశంలో సగం, అవనిలో సగం’ అని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పారు గానీ, మహిళలకు అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే అని తాను ఘంటాపథంగా చెబుతానని రోజా అన్నారు. ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ యాభై శాతం కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అన్నారు. మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈ బిల్లులను సీఎం వైయ‌స్  జగన్ తీసుకొచ్చారని, మహిళలందరూ కూడా సంతోషపడే విషయమని చెప్పారు.