టికెట్ల కేటాయింపే టీడీపీ, జనసేన పొత్తుకు నిదర్శనం
22 Mar, 2019 16:04 IST
తిరుపతి: తెలుగుదేశం పార్టీ, జనసేన కుమ్మక్కయ్యాయని, టికెట్ల కేటాయింపే అందుకు నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే.రోజా ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించి నగరిలో రోజా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపే చూస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. మోసపూరిత చంద్రబాబు బుద్ధిచెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు.