అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నం

27 Feb, 2020 15:28 IST

కర్నూలు:  ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖ ఏయిర్‌ పోర్టులో చంద్రబాబు అనుసరించిన తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో లేని గ్రామాల్లో చంద్రబాబు తన సామాజిక వర్గం నేతలతో ఎలా అడ్డగించారో చూశాం. దళిత ఎంపీ సురేష్‌పై టీడీపీ గుండాలు రైతుల ముసుగులో దాడులు చేశారు. విశాఖలో మాత్రం ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో ఫ్రీ ప్లాన్డ్‌ ఫెయిడ్‌ అర్టిస్టులతో ఉద్యమం చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారన్న దానికి ఇది నిదర్శనమని రోజా అన్నారు. శాంతిభద్రతలకు సహకరించాలని పోలీసులు కోరితే చంద్రబాబు వాగ్వాదానికి దిగడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.