చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పాల్సింది
4 Feb, 2020 12:31 IST
విజయవాడ: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుంది. పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌కు జీవోల గురించి తెలియదని విమర్శించారు. చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూడు రాజధానులకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారు.