దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్ జగన్
వైయస్‌ఆర్ జిల్లా: దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గోపవరం మండలం రాచాయపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని బద్వేల్ ఉప ఎన్నికలో చూపించాలని అభ్యర్థించారు.
మహిళా సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, వైయస్‌ఆర్‌సీపీకి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. బద్వేల్ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.
బద్వేల్ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు.. వారు ప్రజల మన్ననలను చూరగొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇద్దరు సీఎంలుగా పని చేశారు. ఒకర మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. మరొకరు(కిరణ్‌కుమార్‌రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. వైయస్‌ఆర్ జిల్లా వాసులు ఇక్కడి సీఎంలను చూసి గర్వపడాలి.