వైయస్‌ జగన్‌ ప్రజా నాయకుడే కాదు..యుగ పురుషుడు

16 Mar, 2022 12:04 IST

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా నాయకుడే కాదు..యుగ పురుషుడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఓ చరిత్ర అన్నారు. వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి పేజీ ఓ సువర్ణ అధ్యయమని ఆమె తెలిపారు. బుధవారం అసెంబ్లీలో గృహ నిర్మాణంపై ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..రోజా మాటల్లోనే..

రాష్ట్రంలో ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు 29.24 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇవ్వడం నభూతో నభవిష్యత్‌.  టీడీపీ చరిత్ర అంతా చిత్తు కాగితాలు, వెన్నుపోట్లు, దోపిడీలే, అరాచకాలు, దాడులే. వైయస్‌ జగన్‌ రాస్తున్న ఈ చరిత్రలో ప్రతి పేజీ ఒక సువర్ణ అధ్యాయమే. ఎప్పుడైనా, ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించడం చరిత్రలో ఎక్కడైనా చూశామా? అది వైయస్‌ జగన్‌ సత్తా. అందరు ముఖ్యమంత్రులకు ఒకే పవర్‌ ఉంటుంది. మనసున్న ముఖ్యమంత్రి ఉంటేనే ఇలాంటి పథకాలువస్తాయి. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో చూశాం. ఇప్పుడు వైయస్‌ జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాం. నాన్న రెండడుగులు ముందుకు వేస్తే..జగనన్న నాలుగు అడుగులు ముందుకువేశారు. వైయస్‌ఆర్‌ ఆశయాలను నెరవేర్చుతూ..ఆయన్ను అభిమానించే ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆశీర్వదిస్తున్నారు.  

మన ప్రభుత్వం తొలి విడతలోనే రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల  ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. ఇళ్లు మాత్రమే కాదు..ఊర్లకు ఊర్లు కట్టిస్తున్నారు. గతంలో చరిత్రలో అశోకుడు చెట్లు నాటారు అని చెబుతున్నాం. ఇలా ఊర్లు కడుతున్న వైయస్‌ జగనన్న గురించి పాఠ్యపుస్తకాల్లో పాఠాలు చెప్పాలి. వైయస్‌ జగనన్న సంకల్పం ఎంతో గొప్పది. ఓ వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఇంత పెద్ద ఆస్తిని క్రియేట్‌ చేస్తున్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్లను నిర్మించడమే కాకుండా రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేశారు. ఏ రోజు కూడా వైయస్‌ జగన్‌ ఎన్ని కష్టాలు వచ్చినా..ఎన్ని ప్రకృతి వైఫరీత్యాలు వచ్చినా ఎదుర్కొంటూ సుపరిపాలన చేస్తున్న వైయస్‌ జగన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే దాదాపుగా రూ.4 లక్షల కోట్ల విలువైన ఆస్తిని సృష్టించి సరికొత్త చరిత్రను వైయస్‌ జగన్‌ రాయనున్నారు.

ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటే టీడీపీ నేతలు కడుపు మండి కోర్టుకు వెళ్లారు. ఎక్కడ వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందోనని, ప్రజలు సంతోషంగా ఉంటారని ఈ ప్రయత్నాలను చెరిపే కుట్రలు చేశారు. దీనివల్లే ఇళ్ల నిర్మాణాలు కొంత ఆలస్యమైంది. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే చంద్రబాబు మహిళ ద్రోహి ..వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి అని ప్రజలు కొనియాడుతున్నారు.

ఎన్టీఆర్‌ ఆస్తి హక్కును ఆడవాళ్లకు కల్పిస్తే  గొప్ప నాయకుడు అన్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌ ఆడపడుచులకు ఆస్తిని సృష్టించి ఇస్తున్నారు. అందుకు జగనన్న ప్రజా నాయకుడే కాదు..యుగ పురుషుడు ప్రజలందరూ కూడా ఈ రోజు చెప్పుకుంటున్నారు. 
ఇవే కాదు..గతంలో కట్టిన ఇళ్లకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని ఓటీఎస్‌ పథకాన్ని వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారు. దీనిద్వారా 51 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పాదయాత్రలో చాలా మంది వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారి కష్టాలు కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌ వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని తీసుకువస్తే..దీనిపై ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నం చేసింది.

లక్ష 32 వేల కోట్లను 32 నెలల్లో అనేక సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు నేరుగా వైయస్‌ జగన్‌ అందించారు. అలాంటిది ఓటీఎస్‌ ద్వారా వచ్చే కోట్లకు ఆశపడి ఈ పథకాన్ని తీసుకువస్తారా?. లబ్ధిదారుల అప్పు ఎంతా ఉన్నా కూడా కేవలం రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇంటికి పత్రాలు తీసుకువచ్చి ఇస్తున్నారు. రుణాలు మాఫీ అవుతాయి. రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు ఏవీ లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తున్నారు. 22ఏలో ఉండటం వల్ల ఆ  ఇళ్లు అమ్మడం, కొనడం సాధ్యం కాదని, ఇలాంటి వెసులుబాటు కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే రోజా కొనియాడారు.