తప్పు చేయనప్పుడు భయమెందుకు బాబూ?

27 Feb, 2020 12:29 IST

 

కర్నూలు: చంద్రబాబు, లోకేష్‌తో సహా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం ముసుగులో చంద్రబాబు రౌడీయిజం చేయిస్తున్నాడని, దళిత ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. తప్ప చేయనప్పుడు చంద్రబాబుకు భయమెందుకు అని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే ఐటీ దాడుల్లో టీడీపీ నేతలు దొరుకుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని వంచన యాత్రలు చేసినా ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రోజా అన్నారు.