చంద్రబాబుకు పింఛన్‌దారుల ఊసురు తగులుతుంది

వైయస్ఆర్ జిల్లా: ఇళ్ల వద్ద పింఛన్ సొమ్ము అందకుండా అడ్డుకున్న చంద్రబాబుకు పింఛన్‌దారుల ఊసురు తగులుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పింఛన్ కోసం అవస్థలు పడుతున్న అవ్వాతాతలను, దివ్యాంగులను ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి బ్యాంకు వద్ద కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్‌దారుల కష్టాలు తొలగిపోలేదన్నారు. పింఛన్ పొందేందుకు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్‌ను టీడీపీ నేతలే అడ్డుకున్నారని విమర్శించారు. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి అడ్డుకున్నారన్నారు. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. త్వరలోనే ఈ కాష్టాలు తొలగిపోతాయని, మళ్లీ ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు.