టీడీపీ చేసిన పొరపాట్లు మా ప్రభుత్వం సరిదిద్దుతోంది
తాడేపల్లి: ప‌్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేయాలని ప్రయత్నించిందని, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మా ప్రభుత్వం సరిదిద్దుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా ద్వారా నీరిచ్చేందుకు టీడీపీ రూపొందించిన అంచనా వ్యయంతో మా ప్రభుత్వం మూడు రిజర్వాయర్లు నిర్మిస్తుందని చెప్పారు. టీడీపీ నేత దేవినేని ఉమాకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో దేవినేని ఉమా చేస్తున్న ప్రచారం సరైంది కాదు. జీడీ పల్లె ప్రాజెక్టు టీడీపీ హయాంలో 2018 జనవరిలో జీవో ఇచ్చిందన్నారు. దీని చరిత్రను తవ్వి చూస్తే.. 2005లో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా పనులు ప్రారంభించారు. పరిటాల రవి మరణించిన తరువాత పనులు ప్రారంభించారు. 2007లో జీడిపల్లె రిజర్వాయర్ పనులు పూర్తి చేసే దశలో రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యామ్‌కు నీరు ఇవ్వాలని తాను , ఈ ప్రాంతా పెద్దలు నర్సింహరెడ్డి, అనేక మంది రైతులతో కలిసి పేరూరు జలసాధన సమితి ఏర్పాటు చేసి, అప్పటి సీఎం వైయస్ రాజశేఖరరెడ్డిని కలిశామన్నారు. వెంటనే స్పందించిన వైయస్ఆర్..2008లో ఫిజుబులిటీ రిపోర్టు తెప్పించుకున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలో పేరూరు డ్యామ్‌కు నీరిస్తామని ప్రకటించారన్నారు. ఆ తరువాత మహానేత మరణించడం...తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2014లో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పేరూరు డ్యామ్‌కు నీరిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత జీవో ఇచ్చారు. రూ.803 కోట్లతో జీవో తెచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు పనులు ప్రారంభిం, నామమాత్రంగా పనులు చేశారు. అవి కూడా మట్టి పనులు చేసి చేతులు దులుపుకున్నారు. 2015-2016లో టీడీపీ ప్రభుత్వం అంచనాలు రూ.1300 కోట్లు అంటూ ప్రతిపాదనలు రూపొందిస్తే..ఇందులో దోపిడీ జరుగుతుందని అప్పట్లో తాను ఆందోళన చేపట్టాను. ఇంత డబ్బు అవసరం కాదని అనేక సందర్భాల్లో ప్రకటించినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.803 కోట్ల అంచనాల్లో కూడా భారీ అవినీతి జరుగుతుందని కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా అవినీతి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. నిధులు పారించాలని దృష్టి సారించారే తప్ప, నీరు పారించలేకపోయింది. మా ప్రభుత్వం ఈ అంచనాలపై విచారణ చేయించి, ప్రాజెక్టు అంచనాలు తగ్గించకుండా, అదే రేట్లకు ..అదే కాంట్రాక్టర్‌తో మాట్లాడి..పుట్ట కనుమ రిజర్వాయర్ అవసరాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి..హంద్రీనీవా కాల్వ నుంచి ఆయకట్టుకు నీరు ఇవ్వమని పదే పదే అడిగాం. ఈ రోజు వైయస్ జగన్ ఆదేశాలతో పుట్టకనుమ ఆయకట్టుకు నీరిస్తున్నాం. ప్రజా ప్రయోజనాలను ఆలోచించకుండా టీడీపీ ప్రభుత్వం అంచనాలు పెంచి దోచుకునేందుకు ప్రయత్నించింది. దేవినేని ఉమా సీఎం వైయస్ జగన్ గురించి వ్యంగంగా మాట్లాడుతున్నారు. మీరు నిర్ణయించిన ధరకే మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. మీరు చేసిన పొరపాట్లను మేం సరిదిద్దుతున్నాం. ఈ రోజు దాదాపు 6 రేట్లు నీటి సామార్థ్యాన్ని పెంచుతున్నాం. 56 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే ఉద్దేశంతో రీ డిజైన్ చేసి పనులను ప్రారంభించామని చెప్పారు. దేవినేని ఉమా అబద్ధాలు చెప్పినందుకు ముక్కు నేలకు రాసి ప్రజలను క్షమాపణ కోరాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సూచించారు.