హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా, కేవలం హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై అపవిత్రమైన ఆరోపణలు చేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ‘షూ’ భక్తిని, హెరిటేజ్ నెయ్యి అక్రమాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు దైవాపచారం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును ఆయన ఆధారాలతో సహా నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ షూ విప్పి పూజలు చేయలేదని, శంకుస్థాపనలు, హోమాలు, క్షీరాభిషేకాలు.. చివరికి దేవుడి కలశం ముందు కూడా షూ వేసుకునే కూర్చున్న ఫోటోలని మీడియా మందు ప్రదర్శించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు లడ్డూ ప్రసాదం వివాదం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడమేనని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కేజీ నెయ్యి రూ. 321 ఉంటే, దాన్ని ఏకంగా రూ. 658కి పెంచి హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో రూ. 550కే నెయ్యి దొరుకుతుంటే, తిరుమలకు మాత్రం రూ. 658కి ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు నెయ్యి సరఫరాపై హెరిటేజ్ పచ్చి అబద్దాలు చెబుతోందని... తాము దేవాలయాలకు నెయ్యి సరఫరా చేయమని చెబుతున్న హెరిటేజ్ 2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ టెండర్లలో పాల్గొన్న విషయాన్ని ఆధారాలతో బయటపెట్టారు. ఏడుకొండలనూ టీటీడీ పరిధిలోకి తీసుకొస్తూ జీవో 746 జారీ చేయడం ద్వారా... తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి మరింత పెరిగేలా చేశారని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిరుమల, శ్రీశైలం, సింహాచలంలో వరుసగా ప్రమాదాలు, అపశృతులు జరుగుతున్నాయని... తిరుమలలో భక్తుల క్యూలైన్లోకి పాము వచ్చిందంటే పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల మధ్య సంబంధాలపై శాసనమండలిలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా దేవదేవుడిపై చేసిన తప్పుడు ఆరోపణలకు చంద్రబాబు లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని, హెరిటేజ్ లాభాల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానుకోవాలని తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు
● తప్పు కప్పి పుచ్చుకునేందుకే ఎదురుదాడి..
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న సంబంధం, లడ్డూ వ్యవహారంలో గందరగోళం సృష్టించి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన విధానాలపై చర్చిచ్చిద్దాం, తద్వారా దేవదేవుడి ప్రతిష్టను కాపాడుదాం అని శాసనమండలిలో చర్చకు రమ్మని వైయస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దానికి ముందుకు రాకుండా దొంగల్లా పారిపోయిన ప్రభుత్వం... శాసనమండలిలో టీడీపీ నేతలు మాత్రమే మాట్లాడిన ఎడిటెడ్ వీడియోలు మాత్రమే పెట్టి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైయస్ఆర్‌సీపీఎమ్మెల్సీల వీడియోలు, ఫోటోలు బయటకు రావు.
చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసినందుకు నిరసనగా రెండు రోజుల క్రితం శాసనమండలిలో స్వామి వారి ఫోటోలతో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు... వారు చెప్పులతో స్వామివారి చిత్రపటాలను తీసుకుంటున్నట్టు పోటోలు చూశాం. స్వామి వారి ఫోటోలు సఫ్లై చేసినప్పుడు... మా స్ధానాల్లో ఉన్నప్పుడు వాటిని తీసుకుని... చెప్పులు తీసి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశామని ఎమ్మెల్సీలు చెప్పారు. తమ నిరసన గళాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
● బాబు ప్రతి పూజ పాదరక్షలతోనే..
చంద్రబాబును అత్యంతనిష్టాగరిష్టుడైన భక్తుడిలా మాట్లాడుతూ... టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాలో మూడు రోజుల నుంచి అవే ఫోటోలు చూపిస్తూ ప్రసారం చేస్తున్నారు. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రానికి అనేకసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అసెంబ్లీని, శాసనమండలిని ప్రజాస్వామ్య దేవాలయం అని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. చాలా సంతోషం. కానీ అలాంటి దేవాలయ నిర్మాణానికి పూజ చేయడానికి వెళ్లినప్పుడు మీరు చెప్పులు వదిలారా? ఇది ఒక్కటే ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి. ఇది మార్ఫింగ్ ఫోటో అని టీడీపీ నాయకులు మాట్లాడ్డానికి సిగ్గులేదా? కొంచం కూడా ఇంగిత జ్ఞానం లేదా? చంద్రబాబు పక్కన అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్, అధికారులు అందరూ చెప్పులతోనే ఉన్నారు. మరో ఫోటోలో పంతులుగారు పూజ చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకునే పూజ చేశారు. గతంలో షూ లేకుండా చంద్రబాబు ఏ కార్యక్రమం చేయడం నేను చూడలేదు.
ఈ చర్చ జరిగిన తర్వాత రెండు రోజులగా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు అతికష్టం మీద షూ విడుస్తున్నట్టు వీడియోలు, ఫోటోలు విడుదల చేస్తున్నారు. దేవుడి కలశం, ఫోటోలు ఉన్నా షూ వదల్లేదు. మరో ఫోటోలో హోమ గుండం దగ్గరే చెప్పులతో ఉన్నారు. గడ్డపారతో మహుర్తం చేసినప్పుడు, క్షీరాభిషేకం చేస్తున్నప్పుడు కూడా షూతోనే ఉన్నారు. శంకుస్థాపన చేసినప్పుడు గడ్డపారతో తవ్వినప్పుడు కూడా షూతోనే ఉన్నారు.
ఇక చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ప్రధాని మంత్రి గారికి దేవుడి ప్రతిమ ఇస్తున్నప్పుడు షూ తో నే ఉన్నారు. డిప్యూటీ సీఎం కూడా అదే పరిస్ధితి. వీళ్లు చేసిన ప్రతి కార్యక్రమంలోనూ షూ తోనే. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పట్టుకున్నవి పేపర్ మీద దేవుడి ఫోటోలు మాత్రమే.. పూజ కోసం చేసిన దేవుడి చిత్రపటాలు కావు. అయినా కూడా సీఎంగా అనేక పర్యాయాలు చేసిన చంద్రబాబుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ఎంత భక్తి ఉందో వారు చేసిన విన్యాసాలు చూస్తే కనిపిస్తాయి. అయినా మూడు రోజుల పాటు డైవర్షన్ కోసమే ఇదే కధ నడిపించారు. పాపపు మాటలు, వ్యవహారాలు. నిత్యం ప్రజల మీద విషం చల్లడమే వీరు చేస్తున్న పరిపాలన.
● హెరిటేజ్ కోసమే కల్తీ నాటకం...
స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అనేక రకాలుగా మలుపులు తిప్పిన చంద్రబాబు పశ్చాత్తాపం, పాప పరిహారం లేకుండా, లడ్డూ ప్రసాదంలో ఆయన చెప్పిన జంతు, పంది కొవ్వులు, చేపనూనే లేవని తెలిసిన తర్వాత తాను చేసిన తప్పులకు ప్రజలకు, దేవ దేవుడికి లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా ఎదురు దాడి చేస్తున్నాడు. ఆయన చర్యల వెనుక ఉన్న వ్యాపారలావాదేవీలన్నీ బయటకు వచ్చాయి. చిత్తూరు ప్రాంతంలో జన్మించిన చంద్రబాబు కన్ను మంచి లాబాలతో నడుస్తున్న చిత్తూరు సొసైటీ డెయిరీ మీద పడి, దాని స్ధానంలో ప్రైవేటు డెయిరీ పెట్టాలన్న ఆలోచనతోనే తాను అధికారంలోకి రాగానే చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉందని మూసివేశారు. అదే అదునుగా హెరిటేజ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్ర, ప్రకాశం జిల్లాలో ఉన్న టీడీపీ నేత డెయిరీలో సహా దాదాపు ప్రైవేటు డెయిరీలన్నీ వీళ్లవే. రాజమండ్రిలో పాల కల్తీ వలన 5 మంది చనిపోయారు. 16 మంది అస్వస్థతకు గురయ్యారంటూ.. ఆ వాస్తవాలనూ కూడా ప్రభుత్వం దాచిపెడుతుంది.
● ప్రైవేటు డెయిరీ హెరిటేజ్ పై హోంమంత్రి వివరణా?
చిన్న పిల్లల తాగే పాల నుంచి మత్తు పానియాల దాకా కల్తీ చేయడం కాసులు కొట్టేయడం వీరికి అలవాటు. తప్పుడు పనులు చేసి కాసులు వాళ్లకి.. ప్రశ్నించినందుకు కేసులు మాకు. వాళ్లు చేసిన కల్తీ వ్యాపారం బయటపెడితే మాకు నోటీసులు ఇస్తున్నారు. హెరిటేజ్ ఎన్నో అవార్డులు తీసుకున్న కంపెనీ అని... మేం తప్పుడు ప్రచారం చేస్తున్నామని నోటీసులిచ్చారు. భువనేశ్వరి గారెని, లోకేష్, బ్రాహ్మణి గారిని ప్రశ్నిస్తున్నాం. హెరిటేజ్ వల్ల పేద ప్రజలకు కలిగిన లబ్ది ఏమైనా ఉందా? హెరిటేజ్ భూముల కోసం ఏకంగా ఇంటర్నల్ రోడ్డు లైనింగ్ కూడా మార్చారన్న విషయం కూడా బయటపడింది. ఈ రాష్ట్రానికి తాను హోంమంత్రిని అన్న విషయం మర్చిపోయి.. వంగలపూడి అనిత నారా వారి హోమ్ కి హోంమంత్రి అన్నట్టు మాట్లాడుతున్నారు. వారి వ్యాపారాలపై హోంమంత్రికి ఏం పని. హెరిటేజ్ పై వివరణ ఇవ్వాల్సి వస్తే.. ఆ సంస్థ ఛైర్మనో, ఎండీయో మాట్లాడతారు. కానీ రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న హోం మంత్రి ఇలా పదే పదే అబద్దాలు చెప్పడం సమంజసం కాదు. హెరిటేజ్ దేవస్థానాలకు సరఫరాచేయకూడదన్న సిద్ధాంతం పెట్టుకున్నారని చెప్పారు.
● హెరిటేజ్ నెయ్యి - టీటీడీ టెండర్లు - అడ్డగోలు అబద్దాలు
మరి 2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ టీటీడీ బిడ్ లో టెండరు వేసింది. ఆ రోజు 13,73,000 లీటర్ల నెయ్యిని సేకరించడానికి హెరిటేజ్... టీటీడీ పిలిచిన కేజీ రూ.90 నుంచి రూ.140 ధరలకే టెండరు దాఖలు చేసింది. 2001-02లో 13.73 లక్షల లీటర్లు నెయ్యి కోసం కేజీ రూ.90 నుంచి రూ.98 కే దాఖలు చేయగా...2002-03 లో 15.39 లక్షల లీటర్లు రూ.99 నుంచి రూ.140 లకు దాఖలు చేయగా... 2003-04లో రూ.128 కే బిడ్ కోసం టీటీడీ టెండర్లు పిలిస్తే.. హెరిటేజ్ మూడో సంస్థగా దాఖలు చేసింది. మేం ఏ ఆలయానికి బల్క్ గా సరఫరా చేయడం లేదు, చేయకూడదని నిబంధన పెట్టుకున్నాం, 30 ఏళ్లుగా సరఫరాకు ముందుకు రాలేదని చెప్పిన హెరిటేజ్ అసలు బాగోతం ఇది. మరో మంత్రి అచ్చన్నాయుడు అయితే అసలు హెరిటేజ్ నెయ్యి సరఫరాయే చేయదు అని మాట్లాడారు. నెయ్యితో సంబంధం లేదన్నాడు. 2002లో నే అంటే దాదాపు 24 సంవత్సరాలు క్రితమే టీటీడీలో హెరిటేజ్ నెయ్యి వ్యాపారానికి బీజం వేసింది. టిన్నులతో సరఫరా చేస్తే.. రూ.117.75 ధరకు, ట్యాంకర్లతో అయితే రూ. 113.90 కు సరఫరాకు బిడ్ వేసింది. ఇప్పుడు కేజీ నెయ్యి రూ.658 లగా నిర్ణయించారు. కేవలం హెరిటేజ్ కు లాభం జరగడం కోసమే అప్పగించారు. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింనగ్ యూనిట్ అని ఇందాపూర్ డెయిరీని పేర్కొంటూ దానిమీద భువనేశ్వరి గారి ఫోటో కూడా ముద్రించారు. హెరిటేజ్ వెబ్ సైట్ లో కూడా ఉంచారు. ఈ విషయాన్ని వైయస్ఆర్‌సీపీ ఆధారాలతో బట్టబయలు చేయడంతో దాన్ని కో ప్లాంట్ గా మార్చారు. మీరు మార్చినా ఊరుకోం. మీ వెబ్ సైట్ లో మీరు మార్చిన వివరాలు, తేదీ ఆధారాలు అన్నీ ఉన్నాయి.
● హెరిటేజ్ కోసం నెయ్యి రూ.321 నుంచి రూ.658 పెంపు...
రూ.321 ల కేజీ నెయ్యి రూ.658 ఎలా అయింది? ఎందుకు అయింది? సూటిగా ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పగలరా? ఇవాళ ఆన్ లైన్ లో చూస్తే లీటరు రూ.620 కి ఆవు నెయ్యి ఉంటే, రెండు లీటర్లు రూ.1200 ఉంది, అలాంటప్పుడు లక్షలాది లీటర్ల నెయ్యిని రూ.658 చెప్పు ఏ రకంగా ఇందాపూర్ కి కేటాయించారు?
సునయ్ అనే కంపెనీ ఇతర రాష్ట్రాల్లో రూ.550 చొప్పున సరఫరా చేస్తుంది. ఇక్కడ మాత్రం రూ.658 ఎందుకు? రూ. 550 పక్కనే ఉన్న తెలంగాణాలో అమ్ముతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్యాంకర్ల ద్వారా రూ.658 కు ఎలా సరఫరా చేస్తారు?
● బాబు హయాంలోనే జూన్ 12 నే రెండు పాపాలు...
ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగిందీ అంటే అది మీ హయాంలోనే అని సీబీఐ సిట్ ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది. సిట్ ఛార్జిషీట్ లో 64వ పేజీలో నాణ్యతా ప్రమాణాలు లేవని వెనక్కి పంపించిన తిరిగి తప్పించి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదంలో వాడారని చెప్పింది. అంటే నీ ప్రభుత్వంలో నీ ఆధ్వర్యంలోని బోర్డు నేతృత్వంలోనే లడ్డూ లో కల్తీ నెయ్యి వాడారన్నది స్పష్టమవుతుంది.ఈ పాపం నీది కాదా చంద్రబాబూ? సీబీఐ నివేదికలో బోలేబాబా, ప్రీమియర్, ఏ ఆర్ డెయిరీల పేర్లు స్పష్టంగా చెబుతోంది. ఈ మూడు కంపెనీలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు కాదా? ఏ ఆర్ డెయిరీ ఒక్క లీటరు నెయ్యి కూడా వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు సరఫరా చేయలేదు. నీ ప్రమాణ స్వీకారం, ఏ ఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసే రెండు పాపాలు జూన్ 12న జరిగాయి. కల్తీ జరిగి ఉంటే ఆ పాపం మీది కాదా? అడ్డ దారుల్లో నాణ్యత లేదని పంపించిన రెండు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి వచ్చిందంటే ఆ పాపం మీరు కావాలని చేసింది కాదా? ఇవే విషయాలు చర్చించమంటే ఎందుకు పారిపోతున్నారు. మండలిలలో చర్చించండి అంటే నాలుగు గంటలు అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. వైయస్.జగన్ ని ప్రతిపక్ష హోదా ఇచ్చి.. అప్పుడు చర్చించండి. అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు చర్చిద్దాం. పాపం చేసిందే మీరు. శాపాలు కూడా మీకే వస్తున్నాయి. మీ పాపాల ఫలితమే వరుసగా రాష్ట్రంలో దేవస్థానాల్లో జరుగుతున్న అపశృతులు. తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, కాశీబుగ్గ ఇలా వరుసగా భక్తుల పట్ల అపచారాలు, ప్రమాదాలు మీ పాపాల ఫలితమే. తిరుపతలో భక్తుల క్యూలైన్లో పాము వచ్చిందంటే ఇంత కంటే అధ్వాన్నమైన నిర్వహణ ఉంటుందా? ఇంత కంటే చేతకాని చెత్త పరిపాలన ఉంటుందా? అందుకే ప్రజలు మిమ్నల్ని ఛీకొడుతున్నారు. తిరుమలపై మీకు ఎందుకింత కక్ష?
● మీ దుష్ప్రచారానికి తెర పడింది.
వైయస్.జగన్ మీద, వైయస్సార్ మీద మీరు నిత్యం విషం చిమ్ముతూ వేసిన నిందలన్నీ తొలిగిపోయాయి. అత్యంత పవిత్రమైన స్వామి వారి ఏడు కొండలను ప్రభుత్వ సీల్ వేసి, ఆమోద ముద్రవేసి జీవోనెంబరు 746 ద్వారా 2007 జూన్ న ఏడుకొండలను టీటీడీగా నోటిఫై చేస్తూ 322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేవదేవుడి పవిత్ర స్దలంగా గుర్తించిన మహనీయుడు వైయస్. రాజశేఖర్ రెడ్డి. తిరుమల పవిత్రతను కాపాడే ప్రయత్నం చేసిందే వైయస్సార్. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారిభక్తుల కోసం ఎస్ వీ బీసీ - భక్తి ఛానెల్ ని దివంగత నేత వైయస్.రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేస్తే... దాన్ని అడ్డుకున్నదే కాకుండా అసెంబ్లీ సాక్షిగా భక్తిఛానెల్ ఎందుకు అని ప్రశ్నించిన వ్యక్తివి నువ్వు కాదా? చంద్రబాబూ?. మనకు 15 ఛానెళ్లు ఉన్నాయి. నీ ఏబీయన్ ఛానెల్ లో ఎప్పుడైనా రెండు గంటల పాటు స్వామి వారి గురించి ప్రచారం చేశారా? నువ్వు చేసే పాపాలను, తాటికాయంత అక్షరాలతో మా మీదకు నెట్టి మీకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులకు మీ పేరు పెట్టుకుంటారు.
మా ప్రభుత్వ హయాంలో కర్ణాటక నందిని సరఫరా చేస్తే.. ప్రైవేటు వారి నుంచి కమిషన్లు కోసమే నిబంధనలు సఢలించారని ఆరోపించారు. మీ హయాంలో ఇప్పుడు 800 కిలోమీటర్ల నిబంధనను పెట్టిన మీరు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ నుంచి ఎందుకు నెయ్యి తీసుకుంటున్నారు. కేవలం ఇందాపూర్ కోసమే 800 కిలోమీటర్ల లోపు అన్న నిబంధనను తీసివేయడం నిజం కాదా? మీ భాగస్వామి కంపెనీకి లబ్ధి చేకూర్చుందుకే ఇలా చేసిన మాట వాస్తవం కాదా? ఒక్క గోవు లేని బోలేబాబా కి మేం టెండరు ఎలా ఇచ్చామన్నారు, వాస్తవానికి మీ హయాంలోనే టెండరు ఇచ్చారు. ఆలాంటప్పుడు హెరిటేజ్ కి ఎన్ని గోవులున్నాయని టెండరు దాఖలు చేసింది?. 2002లో ఎలా టెండరు దాఖలు చేశారు? ఇదంతా చంద్రబాబు అక్రమ ఆర్జనకు చేసిన తప్పుడు వ్యవహారమే నెయ్యి కల్తీ ఉదంతం. కేవలం హెరిటేజ్ కు లాభం చేకూర్చడానికి చంద్రబాబు ఇదంతా చేశారన్నది పచ్చి నిజం. దీనికి సమాధానం చెప్పి తీరాలి.
టీటీడీ మీద కోపం పెంచుకున్న చంద్రబాబు ఇప్పటికైనా స్వామి వారికి, ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మండలిలో ఇందాపూర్, హెరిటేజ్ డెయిరీల మధ్య సంబంధాలపై చర్చించాలని తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.