రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం

13 Feb, 2026 17:30 IST

తాడేపల్లి: శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపు కూటమి పాలనలో రాష్ట్రం పతనం వైపు అడుగులు వేస్తుంటే... ఆయన మాత్రం పునర్నిర్మాణం అంటున్నాడు. అవినీతి, అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతుంటే... అభివృద్ధి, ఆకాంక్షలు అంటూ మాయమాటలు చెబుతున్నాడు. మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటంటే.. చేస్తున్నాం, చూస్తున్నాం, తెస్తున్నామన్న మాటలే ఇంకా వినిపిస్తున్నాయి. తెచ్చినదేమిటంటే... మీకు 11 సీట్లే వచ్చాయని సంబంధం లేకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. శాసనాసభపక్ష నేత మాట్లాడిన తర్వాత సాధారణంగా సభ వాయిదా పడ్డం ఆనవాయితీ.. కానీ సీఎం చంద్రబాబు తర్వాత మరో ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడింది. అంటే వారి స్థాయిని వారే తగ్గించుకుంటున్నారు. మరోవైపు సభ ఔన్యత్నాన్ని, హుందాతనాన్ని తగ్గిస్తూ.. అసెంబ్లీని అబద్దాలకు వేదికగా, అసత్యాలకు అడ్డాగా మార్చుతున్నారు.  వారు మాట్లాడిన మాటలు చూస్తే... ప్లాప్ అయిన సినిమాకి అత్యధిక వసూల్లు వచ్చాయని సంబరాలు చేసుకున్నట్టుంది. సభాసమయం ఆద్యంతం  వైయస్.జగన్ మీద నిందలు వేయడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కించపరడమే లక్ష్యంగా సాగింది. వారికున్న సంఖ్యాబలంతో అధికారమదాన్ని చూపించే ప్రయత్నం చేసారు.
వారి విధానాన్ని చూస్తే... కూట్లో రాయి తీయలేనమ్మ ఏట్లో రాయి తీయడానికి పోయిందన్న చందంగా ఉంది. మీ పాలనలో జరిగిన అభివృద్ది గురించి చెప్పండంటే...  వైయస్.జగన్ పాలనమీద మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అంగీకరించినా, అంగీకరించకపోయిన వైయస్.జగన్ పాలన ఓ స్వర్ణయుగం.
చంద్రబాబు స్వయంగా తన నోటితోనే .. ఇన్నేళ్ల సీఎంగా చేసినా ఈ 20 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి మునుపెన్నడూ లేదు, సంతృప్తికరంగా ఉందన్నారు. అంటే ఇన్నేళ్లుగా ఈ రాష్ట్రానికి తానేం చేయలేదని ఆయనే అంగీకరించాడు.  అభివృద్ది గురించి మాట్లాడితే చేస్తున్నా, చూస్తున్నా, తెస్తున్నా అని చెప్పడమే తప్ప అది ఎప్పటికో అర్ధం కాని పరిస్థితి. 
మాట్లాడితే 2047 అంటాడు. మీకున్న వయస్సు, మీ పాలనా కాలం గురించి వదిలేసి ఊహల్లో తేలుతుంటాడు. చంద్రబాబు పాలన అంతా క్యాషూ.. సూట్ కేసూ.. రాజేషూ.. లోకేషూ తప్ప మరొక్కటి లేదు. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక వ్యవస్థల క్యాష్ అంతా అందరూ కిలాడి రాజేష్ అని పిలిచే కిలారి రాజేష్ ద్వారా పై స్థాయి వ్యక్తులకు చేరుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు పీపీపీ విధానం ద్వారా సంపదసృష్టి జరుగుతుందని చెప్పారు. అవును సంపదసృష్టి జరుగుతున్న మాట వాస్తవమే అయినా అది రాష్ట్రానికి కాదు.. చంద్రబాబు కుటుంబానికి సంపద సృష్టి జరుగుతుంది.

రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుని దాని కోసం 15వేల మందికి ఉద్యోగాలు కల్పించి.. వారి ద్వారా మద్యం క్రయవిక్రయాలు జరిపి.. ప్రతి పైసాను ప్రభుత్వఖాతాలో వేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి వైయస్.జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. అలాంటిది ఇవాళ మద్యం విక్రయాలను తన అనుయాయులకు, పార్టీ వారికి అప్పగించిన చంద్రబాబు...  నాణ్యమైన మద్యాన్ని నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెస్తున్నానని చెబుతున్నాడు. వాస్తవానికి ఈ డబ్బంతా పచ్చ నేతల జేబుల్లోకి పోతుంది. ఖజానాలో కాసుల్లేవు కానీ.. పచ్చ నేతలు రాబడి మాత్రం పెరుగుతుంది.
మద్యం విక్రయాల ఆదాయాలు చూస్తే..ఈ ఏడాది జార్క్షండ్ లో 45 శాతం, తెలంగాణాలో 22 శాతం, 
మధ్యప్రదేశ్ 17 శాతం, ఉత్తరప్రదేశ్ 16 శాతం వృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మైనస్ 13 శాతం ఆదయాలు పడిపోయాయి. పైగా ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీను దేవాలయం అని చెబుతూనే అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నారు. 
ఆదాయం మైనస్ 13 శాతం ఉంటే రాష్ట్రాన్ని ప్రగతి పగధంలో నడిపిస్తున్నాను అంటున్నాడు. మాట్లాడితే ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఈ రాష్ట్రంలో ఒక ట్రక్కు ఒక వ్యక్తికి కూడా రాలేదు. పేదవాడు పూరిల్లు కట్టుకోవడానికి ఉపయోగించే మట్టిని కూడా చెక్ పోస్టులు పెట్టి కాంట్రాక్టులిచ్చి మరీ నడిపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ అనే వ్యవస్థ ద్వారా నడిపిస్తున్నారు.  ప్రతి గ్రామం నడిబొడ్డున చెక్ పోస్టు పెట్టి మట్టి తీసుకెళ్లినా కుప్పం వారికి కప్పం కట్టాల్సి వస్తోంది.

ఇసుక బంగారాన్ని మించి అమ్ముతోంది. లారీ అమ్ముకోవడానికి తీసుకెళ్లినా కూటమి నేతలకు డబ్బులు కట్టాల్సిందే. ఇసుక వ్యాపారి అంబేద్కర్ విగ్రహానికి ఉరేసుకోవడానికి ప్రయత్నించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అవినీతి పెరిగిపోయింది, చంద్రబాబు పథకాలు రావడం లేదని మరో కార్యకర్త ఎన్టీఆర్ విగ్రహానికి ఉరేసుకోబోతే పోలీసులు కాపాడారు. ఇదీ రాష్ట్రంలో దుస్థితి. వైయస్.జగన్ హయాంలో రూ.7500 కోట్లు ఖజానాకి ఇసుక ద్వారా వస్తే.. ఇవాళ ఆ డబ్బులన్నీ కూటమి నేతల జేబుల్లోకి పోతున్నాయి. అవినీతిని ఒళ్లంతా పూసుకున్న చంద్రబాబు తాను తిరిగి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. స్కిల్ స్కామ్ లో చేతులు మారిన వ్యవహారాన్ని అందరూ గమనించారు. ఒక పీఎ రూ.2వేల కోట్ల అవినీతి సొమ్మును మార్చాడని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తిస్తే.. అలాంటి పీఏను ప్రమోషన్ ఇచ్చి మరీ చేర్చుకున్నారు. మరలా వీల్లు అవినీతి గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న మైన్స్ అన్నీ టీడీపీ నేతలవే.
విశాఖలో రూ.5వేల కోట్ల ఖరీదు చేసే 50 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులకే ధారాదత్తం చేశాడు.  కౌన్సిల్ లో మాత్రం ఉర్సా లాంటి సంస్థలకు 99 పైసలకే భూములిచ్చారని ప్రశ్నిస్తే.. మంత్రి లోకేష్  మీ దగ్గర ఆధారాలుంటే చూపించమంటున్నాడు. మరోవైపు చంద్రబాబు మాత్రం ఉద్యోగాలివ్వడానికి రూ.99 కే ఇస్తే తప్పేంటి, ఉద్యోగాలివ్వడానికి ఉచితంగా ఇస్తామని చెబుతున్నాడు. 20 నెలల్లో  మీరు కల్పించిన ఉద్యోగాలు ఎన్ని?  నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? 
 దానికి కేటాయించిన నిధులెన్ని? అని అడిగితే 20 లక్షల ఉద్యోగాలని గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడించాం. ఇప్పటికే 5 లక్షలు ఉద్యోగాలిచ్చామని అబద్దాలు చెప్పించారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? వస్తే ఏ కంపెనీ ద్వారా వచ్చింది? ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? మీది చెత్త పరిపాలనకాకపోతే ఉద్యోగాలిచ్చిన 5 లక్షల మంది పేర్లు చెప్పాలి. 

మరోవైపు దాదాపు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. వైయస్.జగన్ హయాంలో 66 లక్షల పెన్షన్లు ఇస్తే.. కూటమి ప్రభుత్వం కేవలం 60 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తోంది. 6 లక్షల పెన్షన్లు ఎందుకు తీసేశారంటే... సమాధానం చెప్పరు. తగ్గించిన మాట వాస్తవం కాదా?

రైతులకు చిల్లిగవ్వ చెల్లించని చెత్త ప్రభుత్వమిది...

మేం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం మీరు నడిపిస్తుంటే... ఏ నిబంధన ప్రకారం వాళ్లు పెన్షన్ కి అర్హులో.. అదే నిబంధన ప్రకారం మీరు వారిపై అనర్హత వేటు వేసి 6 లక్షల మందిని ఎలా తీసివేస్తారు. ఒక్క పెన్షన్ కొత్తగా ఎందుకు ఇవ్వలేదంటే.. ఇంకా విధి, విధానాలు గురించి మాట్లాడుతున్నాడు. టీడీపీ 2019లో వారు దిగిపోయే సమయానికి 34 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చింది. ఇవాళ ఒక్క పెన్షన్ కొత్తగా టీడీపీ ఇవ్వకపోగా.. 6 లక్షల మంది పెన్షనర్లను తొలగించినా ఇంకా 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారంటే అది వైయస్.జగన్ గొప్పదనమే. 
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లు, కాలేజీల ఆధునికీకరణకు విద్య కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యవసాయం గురించి చూస్తే.. వైయస్.జగన్ సాగును పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశాడు. మొంధా తుపాన్ అక్టోబరులో వస్తే.. ఇవాల్టి వరకు రైతులకు అర్ధరూపాయి కూడా ఇవ్వని చెత్త ప్రభుత్వమిది.అసెంబ్లీలోమాత్రం చంద్రబాబు పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఒక్క ఎకరాకు బీమా సౌకర్యం కానీ, రైతులకు పెట్టుబడి సాయం కానీ ఇవాల్టి వరకు పూర్తిగా చెల్లించలేదు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చానని చెబుతున్నాడు. అది కూడా అబద్దం. 99 పైసలకే స్థలాలను ఉర్సాలాంటి కంపనీలకు ధారాదత్తం చేస్తూ.. లాభాపేక్షతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు.

పీ-4 ద్వారా ప్రజలను జీవో పావర్టీకి తీసుకెళ్తున్నానని చెబుతున్నాడు. జీరో పావర్టీ సంగతి పక్కనపెడితే.. ప్రధానమైన ఆరు హామీల్లో ఒక్కటైన స్త్రీ శక్తి పథకం కింద  ప్రతి ఒక్కరికి రూ.3వేలు ఇస్తామన్నారు.ఇవాల్టికి అది నెరవేర్చలేదు. ఒక్క రూపాయి ఇవ్వకపోగా పక్కరాష్ట్రాలతో లాలూచీ పడుతూ తన మీదున్న కేసులను ఎత్తివేయించేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కూడా తాకట్టు పెట్టేశాడు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మరలా అబద్దాలు చెబుతూ.. సముద్రంలోకి పోయే నీటిని నల్లమలసాగర్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు తరలిస్తామని చెబుతూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 

రాయలసీమకు గుక్కెడు నీళ్లివ్వని అసమర్థుడు చంద్రబాబు..

నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ. హంద్రీనీవాకు 96లో ఒకసారి, 98లో మరోసారి, పార్లమెంటు ఎన్నికలకు మందు, సాధారణ ఎన్నికలకు మందు కేవలం 5 టీఎంసీలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
2004 వరకు ఆ ప్రాజెక్టుకు అతీగతీ లేకుండా చేశారు. ఇవాల కుప్పానికి నీళ్లిస్తున్నామని నువ్వు గొప్పగా చెప్పుకునే హంద్రీనీవా కాలువ దివగంత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి చలువే. మేం చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం నీకలవాటే బాబూ. రౌడీలు లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తున్నామని బాబు బడాయి మాటలు చెబుతున్నాడు. ఉన్న రౌడీలందరికీ టీడీపీ కండవాలు వేసి మీ పార్టీలో చేర్చుకుంటుంటే ఇంకెక్కడ రౌడీలుంటారు.