సీఎం వైయస్ జగన్ పేరు గిన్నీస్ బుక్‌లో చేర్చాలి
1 Dec, 2020 15:46 IST

అమరావతి: ప్రపంచంలోనే 30 లక్షల మంది పేదవారికి గూడు కల్పించే కార్యక్రమం ఎక్కడా ఉండదని, మంత్రులు ఈ విషయంపై పరిశీలన చేసి గిన్నిస్ బుక్‌లో సీఎం వైయస్ జగన్ పేరును చేర్చాలని ఎమ్మెల్యే పార్థసారధి కోరారు. చంద్రబాబుతో ఈ కార్యక్రమాన్ని పోల్చడం కాదని, ప్రపంచంలో ఇలాంటి రికార్డు ఉందేమో గమనించాలని మంత్రులను కోరారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఒక రికార్డు అన్నారు.