చంద్రబాబులాంటి డర్టీ పొలిటిషియన్ ఎవరూ లేరు
9 May, 2020 13:23 IST
నెల్లూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి డర్టీ పొలిటీషియన్ దేశంలోనే ఎవరూ ఉండరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విశాఖ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ ఘటనపై సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించారన్నారు.బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సాయం అందించడం తప్పా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బుదర జల్లుతున్నారన్నారు. ఇదే చంద్రబాబు గతంలో ప్రధాని మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వనని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అదే మోదీని ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారని ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు.