ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు
8 Feb, 2023 14:31 IST
నెల్లూరు: ఉదయగిరి వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయనకు అక్కడే చికిత్స అందుతున్నట్లు సమాచారం. అయితే.. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నైకు తరలించారు. రెండు రోజుల్లో క్షేమంగా తిరిగి వస్తానని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.