గిరిజన చట్టాల జోలికొస్తే పోరాటం తప్పదు
29 Jan, 2025 15:07 IST
విశాఖ: గిరిజన చట్టాల జోలికొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గిరిజనుల కోసం పోరాటం చేస్తానని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన చట్టాలలో 1/70 చట్టం సవరణ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు అన్యాయమన్నారు. బుధవారం మత్యరాస విశ్వేశ్వరరాజు మీడియాతో మాట్లాడారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి కావాలంటే గిరిజన చట్టాలను సవరణ చేయనవసరం లేదన్నారు. గిరిజన చట్టాలను రద్దు చేసి కూటమి నాయకులు ఇక్కడ మైనింగ్ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై గవర్నర్, రాష్ట్రపతిలకు పిర్యాదు చేయనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.