చంద్రబాబు హిందూ మత ద్రోహి
తాడేపల్లి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కల్లోల్లాలు సృష్టిస్తే ఎంతటివారైనా సరే సహించేది లేదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. చంద్రబాబు హిందూ మత ద్రోహి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి దేవాలయాలు కూల్చివేస్తే..వాటిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పునః నిర్మిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఈ నెల 8వ తేదీన సీఎం వైయస్ జగన్ ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారని విష్ణు వెల్లడించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన సాగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తు.చ.తప్పకుండా వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో అన్ని మతాల వారు ఐక్యంగా జీవిస్తున్నారు. బీజేపీ, టీడీపీలు ఏపీలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఆపేయాలని ఆయన సూచించారు.
మంచి, మానవత్వంతో రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులంతో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మతంతో రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగేవి మతమార్పిడులు కాదు.. టిడిపి నాయకులు అంతా కూడా వైయస్సార్ సిపి వైపు మళ్లుతున్నారు. పార్టీ మార్పులు ఆప లేక చంద్రబాబు నాయుడు మతమార్పిడి అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రి, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ అందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వారే. నాడు టిడిపి, బిజెపి అధికారంలో ఉన్నారు. మీ పాలనలో గుడిలోని విగ్రహాన్ని తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసిన చరిత్ర చంద్రబాబుది. ఈరోజు ఊరికి దూరంగా ఉన్న విగ్ర హాలను తొలగిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలను చంద్రబాబు తీసుకున్నారు. నాడు అమరావతి జపం చేసిన చంద్రబాబు సదావర్తి భూములను కొట్టాలని ప్రయత్నం చేశారు. దుర్గ గుడి, శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు చేసింది చంద్రబాబు కాదా. తిరుపతిలో వెయ్యికాళ్ల మండపాన్ని కూర్చుంది ఎవరు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది. వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.
గత ప్రభుత్వంలో కూల్చిన గుడ్లన్నీ కూడా పునర్నిర్మించేందుకు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 11గంటలకు విజయవాడలో గుళ్ల పునర్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేస్తారు.ఇటీవల జరిగిన తుంగభద్ర పుష్కరాలు చంద్రబాబు గాని, ఆయన కుమారుడు లోకేష్ గాని అటువైపు తొంగి చూశా అలా అని ప్రశ్నించారు. అమరావతి డిజైన్లు అమరేశ్వరుని ఫోటో ఎందుకు పెట్టలేదు.. బుద్ధుడి ఫోటో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. కరోనా సమయంలో అర్చకులను సీఎం వైయస్ జగన్ ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హిందూమత ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో వంశపారంపర్య హక్కు ఇవ్వలేక పోయిన వ్యక్తి చంద్రబాబు. ఈరోజు వైయస్ జగన్ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వంశపారంపర్య హక్కు ను ఇచ్చారు. గోదావరి పుష్కరాలు 30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.
బండి సంజయ్..ఒళ్లు దగ్గర పెట్టుకో
బండి సంజయ్ అనే వ్యక్తి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని మల్లాది విష్ణు హెచ్చరించారు.
మతాలను కించపరిచినా, మత కల్లోల్లాలు సృష్టించిన చట్టపరమైన చర్యలు తప్పవు. వైయస్ఆర్ కుటుంబం హిందూ మతానికి పూర్వం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అన్ని మతాల వారు కలిసి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మత కల్లోలాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు 90 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా అందించిన ఘనత సీఎం వైయస్ జగన్. మత విద్వేషాలను పరిచయం చేయాలని టిడిపి, బిజెపి ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని మల్లాది విష్ణు హెచ్చరించారు.