టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్దమా?
1 Dec, 2020 12:57 IST
అమరావతి: టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్దమా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్ విసిరారు. చంద్రబాబు తీరు శాసనసభను, రాజ్యాంగ వ్యవస్థలను కించ పరిచేలా ఉందని విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, వాటిలో వెయ్యి కోట్లు తమ ప్రభుత్వం కట్టిందని వెల్లడించారు. రివర్స్ టెండర్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి బయట పడిందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల అంశంలో టీడీపీ పనికట్టుకుని దుష్ప్రచారనికి తెరలేపిందని ఆరోపించారు.