నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం
నెల్లూరు: త్వరలో జరుగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ జెండాను ఎగురవేద్దామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు చక్రధారి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు. 29వ డివిజన్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ షేక్ సత్తార్, 54 డివిజన్ లలో ఉన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానన్న రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు చక్రధారి ఎంతో మంచి మనసుతో ముందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే అభినందించారు. పద్మశాలి సంఘంకు సంబంధించి పది మందికి మేలు చేసే ఏ నిర్ణయం తీసుకున్నా స్థానిక ఎమ్మెల్యే గా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పద్మశాలి సంఘం పూర్తి మద్దతుగా ఉంటుందని ఆ సంఘంఅధ్యక్షుడు చక్రధారి పేర్కొన్నారు.